‘ఆరెంజ్ ఆర్మీ’ అదిరింది
ABN , First Publish Date - 2020-06-23T10:00:25+05:30 IST
ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుంటే.. ఇప్పటికే ఆ కుర్రాడి పేరు మార్మోగిపోయుండేది. అవును.. హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల లిఖిత్...

సన్‌రైజర్స్ థీమ్‌సాంగ్‌తో అలరిస్తున్న లిఖిత్
హైదరాబాద్: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుంటే.. ఇప్పటికే ఆ కుర్రాడి పేరు మార్మోగిపోయుండేది. అవును.. హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల లిఖిత్ దోర్బల..ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోసం ‘ఆరెంజ్ ఆర్మీ’ పేరిట ఓ థీమ్ సాంగ్‌ను రూపొందించాడు. ఈ పాటకు తాను రచయిత, స్వరకర్తగా వ్యవహరించడంతో పాటు లిఖితే గానం చేయడం విశేషం. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో స్వరపరచిన ఈ పాట వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన లిఖిత్.. మరో నలుగురితో కలిసి ‘డబ్ల్యూఏఎ్‌సపీ’ పేరిట మ్యూజిక్ బ్యాండ్ నిర్వహిస్తున్నాడు.