రూ. 200 కోట్లు సాయం చేయండి

ABN , First Publish Date - 2020-05-18T09:20:06+05:30 IST

కరోనా కారణంగా ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న క్రీడా సంఘాలకు చేయూతనివ్వాలని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది...

రూ. 200 కోట్లు సాయం చేయండి

ప్రభుత్వాన్ని కోరిన ఐఓఏ

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న క్రీడా సంఘాలకు చేయూతనివ్వాలని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా సంఘాలను ఆదుకోవడానికి రూ. 200 కోట్ల మేర సాయం చేయాలని క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజుకు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా లేఖ రాశారు. ప్రభుత్వం సాయం అందించకపోతే.. లాక్‌డౌన్‌ తర్వాత క్రీడా కార్యకలాపాలను నడపడం కష్టమని చెప్పారు. ఐఓఏకు రూ. 10 కోట్లు, జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ. 5 కోట్లు, నాన్‌ ఒలింపిక్‌ ఎన్‌ఎ్‌సఎ్‌ఫలకు రూ. 2.5 కోట్లు, రాష్ట్ర ఒలింపిక్‌ సంఘాలకు రూ. కోటి చొప్పున సాయం చేయాలని బాత్రా కోరారు. వచ్చే ఏడాది వరకు స్పాన్సరర్లు ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని లేఖలో పేర్కొన్నారు.  

Updated Date - 2020-05-18T09:20:06+05:30 IST