మరో హాకీ ఆటగాడికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-08-11T09:18:52+05:30 IST
భారత హాకీ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సహా ఐదుగురు ఆటగాళ్లు ఇప్పటికే పాజిటివ్‌గా తేలగా.. తాజాగా ...

న్యూఢిల్లీ: భారత హాకీ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సహా ఐదుగురు ఆటగాళ్లు ఇప్పటికే పాజిటివ్‌గా తేలగా.. తాజాగా మరో ఆటగాడికి వైరస్ సోకింది. జలంధర్‌కు చెందిన ఫార్వర్డ్ ప్లేయర్ మన్దీప్ సింగ్ కొవిడ్-19 పరీక్షలో పాజిటివ్‌గా బయటపడ్డాడని భారత క్రీడాప్రాథికార సంస్థ (సాయ్) సోమవారం ప్రకటించింది. దీంతో.. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20 నుంచి జరగాల్సిన జాతీయ శిక్షణ శిబిరాన్ని వాయిదా వేసే ఆలోచనలో హాకీ ఇండియా (హెచ్ఐ) ఉంది. ఇదివరకే పాజిటివ్‌గా తేలిన హాకీ ఆటగాళ్లు మన్‌ప్రీత్, సురేందర్, జస్కరణ్ సింగ్, వరుణ్ కుమార్, కృష్ణన్ బహదూర్ పాఠక్‌లు కోలుకుంటున్నారని సాయ్ తెలిపింది.