పుజారా కూడా రేసిజం బాధితుడేనా!

ABN , First Publish Date - 2020-12-05T22:10:52+05:30 IST

క్రికెట్‌లో జాతి వివక్షపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ బోర్డులు దీనిపై దృష్టి సారించాయి. తమకందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక కమిటీలను...

పుజారా కూడా రేసిజం బాధితుడేనా!

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో జాతి వివక్షపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ బోర్డులు దీనిపై దృష్టి సారించాయి. తమకందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక కమిటీలను నియమించి విచారణ కూడా చేస్తున్నాయి. ఇందులో భాగంగానే యార్క్‌షైర్ క్రికెట్ కౌంటీ క్లబ్‌ అండర్-19 కెప్టెన్ అజీం రఫిక్ దాఖలు చేసిన ఫిర్యాదుపై అక్కడి కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఇందులో అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆ క్రికెట్ కౌంటీలో తెల్ల జాతీయులు నల్లజాతీయులతో కావాలనే వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వెల్లడవుతోంది. అందులో భారత క్రికెటర్ చటేశ్వర్ పుజారా కూడ ఉన్నాడట. 


ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్ క్రికెట్ కౌంటీకి పుజారా ఒకప్పుడు ఆడేవాడు. అదే సమయంలో అతడిని తోటి ఆటగాళ్లు అతడిని నల్లజాతీయుడిగా వివక్ష చూపేవారట. ఈ విషయాన్ని అదే కౌంటీకి చెందిన ఓ మాజీ ఉద్యోగి బయటపెట్టాడు. ఒక్క పుజారానే కాదని, నల్లజాతీయులందరినీ వారు వివక్షతోనే చూసేవారని, అందరినీ ఒకే పేరుతో పిలిచేవారని చెప్పుకొచ్చాడు. పుజారా విషయంలో అయితే అతడి పేరు పలకలేకపోవడం వల్లనే అలా పిలుస్తున్నామనేవారని ఆటగాళ్లు సమాధానమిచ్చేవారంటూ వివరించాడు. 

Updated Date - 2020-12-05T22:10:52+05:30 IST