టీ20 సిరీస్ గెలుపుతో భారత్ ఖాతాలో మరో రికార్డు
ABN , First Publish Date - 2020-12-07T00:40:29+05:30 IST
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో

సిడ్నీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో టీ20లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ వశమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. బదులుగా భారత జట్టు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. టీ20లలో భారత్‌కు ఇది వరుసగా ఐదో సిరీస్ విజయం. అలాగే, తమ వరుస విజయాలను 11 మ్యాచ్‌లకు పెంచుకుంది.