ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది: బీసీసీఐ?

ABN , First Publish Date - 2020-05-10T01:09:09+05:30 IST

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీం

ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది: బీసీసీఐ?

ముంబై: కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీం ఇండియా పర్యటన కూడా రద్దు అయ్యే అవకాశం ఉండటంతో.. క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. 


అయితే ఈ పర్యటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరిగి తీరుతుందని.. కావాలంటే.. భారత ఆటగాళ్లను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ తాజాగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్-జనవరిల్లో టీం ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించాల్సింది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య నాలుగు టెస్ట్‌లు, మూడు వన్డేలు జరగనున్నాయి. 


అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ఎవరైనా అక్కడ రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనని బీసీసీఐ రద్దు చేస్తుందని అంతా భావించారు. కానీ, షెడ్యూల్ యథావిధిగా జరుగుతుందని.. అవసరమైతే.. ఆటగాళ్లు 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటారని... బీసీసీఐ అధికారులు తాజాగా వెల్లడించినట్లు సమాచారం.

Updated Date - 2020-05-10T01:09:09+05:30 IST