భారత్‌కు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన ఆస్ట్రేలియా
ABN , First Publish Date - 2020-12-06T21:03:09+05:30 IST
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో

సిడ్నీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసి భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన మాథ్యూవేడ్ అదరగొట్టాడు. 32 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 58 పరుగులు చేశాడు. స్మిత్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. ఆర్కీషార్ట్ 9, మ్యాక్స్‌వెల్ 22, మొయిసెస్ హెన్రిక్స్ 26, మార్కస్ స్టోయినిస్ 16 (నాటౌట్), డేనియల్ శామ్స్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.