బ్రేకింగ్ న్యూస్: భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు

ABN , First Publish Date - 2020-03-13T23:33:20+05:30 IST

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న ధర్మశాలలో

బ్రేకింగ్ న్యూస్: భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు

న్యూఢిల్లీ: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న ధర్మశాలలో తొలి వన్డే జరగాల్సి ఉండగా వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే రద్దు చేశారు. ఈ నెల 15న లక్నోలో రెండో వన్డే, 18న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చివరి వన్డే జరగాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ నిర్ధారిత కేసులు దేశంలో రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో మొత్తం సిరీస్‌ను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.


కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని ఈవెంట్లు వాయిదా పడ్డాయి. తాజాగా, ఈ నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ను కూడా బీసీసీఐ వాయిదా వేసింది. ఇప్పుడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మిగతా రెండు వన్డేలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సిరీస్ రద్దు అయిందన్నమాట. నిజానికి ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ చివరికి రద్దు వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.

Updated Date - 2020-03-13T23:33:20+05:30 IST