డే/నైట్ టెస్టులో తలపడనున్న భారత్-ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2020-02-17T02:47:44+05:30 IST

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో

డే/నైట్ టెస్టులో తలపడనున్న భారత్-ఆస్ట్రేలియా

ముంబై: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న కోహ్లీసేన ఆ జట్టుతో తొలిసారి డే/నైట్ టెస్టులో తలపడనుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘అవును, ఆస్ట్రేలియాలో భారత జట్టు డే/నైట్ టెస్టు ఆడుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుంది’’ అని గంగూలీ ఆదివారం తెలిపాడు. అలాగే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టు కూడా డే/నైట్ టెస్టు మ్యాచే అవుతుందని పేర్కొన్నాడు. ప్రతీ సిరీస్‌లోనూ కనీసం ఒక్కటైనా డే/నైట్ టెస్టు ఉండేలా చూస్తున్నట్టు గంగూలీ చెప్పుకొచ్చాడు.


గతేడాది నవంబరులో భారత జట్టు తొలిసారి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో డే/నైట్ టెస్టు ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రెండు రోజుల ముందుగానే మ్యాచ్ ముగిసినప్పటికీ విశేష ఆదరణ లభించింది. ఆస్ట్రేలియాలో భారత్ ఆడనున్న డే/నైట్ టెస్టుకు సంబంధించిన వేదిక విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే అడిలైడ్ లేదంటే పెర్త్‌లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2020-02-17T02:47:44+05:30 IST