ఇండియా ఓపెన్‌లో ప్రేక్షకులకు నో ఎంట్రీ

ABN , First Publish Date - 2020-03-12T10:10:01+05:30 IST

ఈ నెలాఖరులో జరిగే ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ప్రేక్షకులకు అనుమతి లేదు. ఇందుకు కారణం కరోనా వైరస్‌. దేశాన్ని కొవిడ్‌-19 ...

ఇండియా ఓపెన్‌లో ప్రేక్షకులకు నో ఎంట్రీ

న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో జరిగే ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ప్రేక్షకులకు అనుమతి లేదు. ఇందుకు కారణం కరోనా వైరస్‌. దేశాన్ని కొవిడ్‌-19 బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య, భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియా ఓపెన్‌ ఈనెల 24 నుంచి 29 వరకు జరగనుంది. వాస్తవానికి ఈవెంట్‌నే రద్దు చేయాలనుకున్నా.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే కీలకమైన ఈవెంట్‌ కావడంతో షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌లను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వైరస్‌ నివారణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ.. అందులో భాగంగానే స్టేడియం లోపలికి ప్రేక్షకులను అనుమతించడం లేదని బాయ్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ సింఘానియా వెల్లడించారు. 

Updated Date - 2020-03-12T10:10:01+05:30 IST