కొత్త కారు కొన్న ధోనీ.. ఫొటో షేర్ చేసిన సాక్షి

ABN , First Publish Date - 2020-08-18T22:43:39+05:30 IST

ధోనీకి కార్లు, బైకులంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇప్పటికే అతడి ఇంట్లో ఎన్నో కార్లు, బైక్‌లు ఉంటాయి. వీటికి తోడు కొత్తగా..

కొత్త కారు కొన్న ధోనీ.. ఫొటో షేర్ చేసిన సాక్షి

న్యూఢిల్లీ: ధోనీకి కార్లు, బైకులంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇప్పటికే అతడి ఇంట్లో ఎన్నో కార్లు, బైక్‌లు ఉంటాయి. వీటికి తోడు కొత్తగా ఏది కనబడిన కొనేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే వింటేజ్ మోడల్ పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఏఎం కారును ధోని ఇటీవల కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోను అతడి భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘వెల్‌కమ్ బ్యాక్! మహి7781 మిస్సింగ్ యూ’ అంటూ ట్రాన్స్ ఏఎం హాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ధోని ఐపీఎల్-2020 కోసం చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-18T22:43:39+05:30 IST