ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున పాకిస్థాన్‌కు ఏడోసారి షాకిచ్చిన టీమిండియా!
ABN , First Publish Date - 2020-06-17T03:22:55+05:30 IST
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున ఐసీసీ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్‌ను

న్యూఢిల్లీ: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున ఐసీసీ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం భారత్‌కు ఇది వరుసగా ఏడోసారి. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ 113 బంతుల్లో 140 పరుగులతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు చిరకాల ప్రత్యర్థులపై అద్వితీయ విజయాన్ని సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 336 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 24వ సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలు చేశారు. పాకిస్థాన్ 89 పరుగులతో పరాజయం పాలైంది. 337 పరుగుల విజయ లక్ష్యంతో పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది. 35వ ఓవర్ వద్ద మ్యాచ్‌కు 50 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. దీంతో పాక్ విజయ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ విధానంలో 40 ఓవర్లలో 302 పరుగులకు కుదించారు. పాకిస్థాన్ 30 బంతుల్లో 136 చేయాల్సి వచ్చింది. చివరికి 89 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత్.. న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలై ఇంటి ముఖం పట్టింది.