అడిలైడ్‌లో ఆసీస్‌తో భారత్ డే/నైట్ టెస్టు!
ABN , First Publish Date - 2020-10-07T09:22:16+05:30 IST
ఐపీఎల్ ముగియగానే జరిగే భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు సంబంధించి ప్రాథమిక షెడ్యూల్ బయటకి పొక్కింది.

న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగియగానే జరిగే భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌కు సంబంధించి ప్రాథమిక షెడ్యూల్ బయటకి పొక్కింది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులను ఆడనుంది. నవంబరు 25 నుంచి 30 మధ్య వన్డేలు, డిసెంబరు 4 నుంచి 8 మధ్య టీ20లు జరగొచ్చు. ఇక, డిసెంబరు 17న అడిలైడ్‌లో జరిగే డే/నైట్ మ్యాచ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యే అవకాశముంది. 26న రెండోదైన బాక్సింగ్ డే టెస్టు, జనవరి 3న మూడో టెస్టు, 15న నాలుగో టెస్టు జరగనుంది. అడిలైడ్ టెస్టుకు ముందు ఒక వామప్ మ్యాచ్ కూడా జరిగే అవకాశముందని తెలుస్తోంది.