హాట్‌కేకుల్లా ..

ABN , First Publish Date - 2020-11-21T10:13:56+05:30 IST

సూపర్‌ స్టార్లతో కూడిన భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లంటే ఆ మజానే వేరు. అందుకే ఈ మ్యాచ్‌లను ఎప్పుడెప్పుడు..

హాట్‌కేకుల్లా ..

సిడ్నీ: సూపర్‌ స్టార్లతో కూడిన భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లంటే ఆ మజానే వేరు. అందుకే ఈ మ్యాచ్‌లను ఎప్పుడెప్పుడు ప్రత్యక్షంగా తిలకిద్దామా అన్నట్టు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు టీ20లు, రెండు వన్డేల కోసం శుక్రవారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) టిక్కెట్ల అమ్మకాలను ఆరంభించింది. అంతే.. తొలిరోజే ఫ్యాన్స్‌ ఎగబడి మరీ కొనుగోలు చేయడంతో టిక్కెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయాయి. కరోనా వెలుగు చూశాక క్రికెట్‌ మ్యాచ్‌లన్నీ ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతున్నాయి. అయితే ఆసీ్‌సలో మాత్రం 50శాతం ప్రేక్షకులకు అనుమతివ్వడంతో ఫ్యాన్స్‌ నుంచి డిమాండ్‌ పెరిగింది. టీ20 సిరీస్‌ ఓవల్‌, సిడ్నీ మైదానంలో జరుగుతాయి. రెండు, మూడో వన్డేల టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోగా, తొలిమ్యాచ్‌కు 19 వందల టిక్కెట్లు ఉన్నట్టు సీఏ తెలిపింది. 

Read more