ఆస్ట్రేలియా ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నేటినుంచి

ABN , First Publish Date - 2020-12-06T10:13:28+05:30 IST

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కీలకమైన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ ఈనెల 17న ప్రారంభం కానుంది. ఇందుకు భారత టెస్ట్‌ జట్టు సన్నాహకాలను మొదలు పెట్టనుంది. భారత్‌ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య

ఆస్ట్రేలియా ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నేటినుంచి

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కీలకమైన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ ఈనెల 17న ప్రారంభం కానుంది. ఇందుకు భారత టెస్ట్‌ జట్టు సన్నాహకాలను మొదలు పెట్టనుంది. భారత్‌ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య మూడ్రోజుల తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆదివారం నుంచి ఇక్కడి డ్రమోయన్‌ ఓవల్‌ మైదానంలో జరగనుంది. టెస్ట్‌లకు తుది జట్టు కూర్పునకు భారత్‌ ఈ మ్యాచ్‌ను వేదికగా చేసుకోనుంది. రహానె, పుజార, విహారి, అశ్విన్‌, ఉమేశ్‌, సిరాజ్‌, సాహా, పంత్‌ తదితరులు సుదీర్ఘ ఫార్మాట్‌కు సంసిద్ధమయ్యేందుకు ఈ మ్యాచ్‌ తోడ్పడనుంది.

Updated Date - 2020-12-06T10:13:28+05:30 IST