బాక్సింగ్ డే టెస్ట్.. టీమిండియా విజయ లక్ష్యం 70
ABN , First Publish Date - 2020-12-29T13:32:02+05:30 IST
బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్సు ముగిసింది.
మెల్ బోర్న్: బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ రెండో ఇన్నింగ్సు ముగిసింది. 200 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ ముందు 70 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 133/6 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ప్రారంభించిన ఆసీస్ మరో 67 పరుగులు మాత్రమే జోడించగలిగింది. కామెరూన్ గ్రీన్(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీసుకోగా, బుమ్రా, అశ్విన్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. యాదవ్ ఖాతాలో ఒక వికెట్ పడింది.