పట్టుబిగించిన కివీస్
ABN , First Publish Date - 2020-12-06T10:08:10+05:30 IST
వెస్టిండీ్‌సతో తొలి టెస్ట్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఇన్నింగ్స్ విజయం ఊరిస్తోంది. పేసర్ టిమ్ సౌథీ (4/35) విజృంభణతో.. ఓవర్‌నైట్ స్కోరు 49/0తో మూడో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన

విండీస్ తొలి ఇన్నింగ్స్ 138
ఫాలోఆన్‌లో 196/6
హామిల్టన్: వెస్టిండీ్‌సతో తొలి టెస్ట్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఇన్నింగ్స్ విజయం ఊరిస్తోంది. పేసర్ టిమ్ సౌథీ (4/35) విజృంభణతో.. ఓవర్‌నైట్ స్కోరు 49/0తో మూడో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 138 రన్స్‌కే కుప్పకూలింది. క్యాంప్‌బెల్ (26) టాప్‌స్కోరర్. జెమిసన్, వాగ్నర్ రెండేసి వికెట్లు తీశారు. ఫాలోఆన్‌లోనూ కివీస్ బౌలర్లు చెలరేగడంతో విండీస్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. బ్లాక్‌వుడ్ (80 బ్యాటింగ్), అల్జారీ జోసెఫ్ (59 బ్యాటింగ్) అర్ధ సెంచరీలతో ఆదుకోవడంతో విండీస్ ఆట చివరకు 196/6 స్కోరు చేసింది. వీరు పోరాడకపోతే కివీ్‌సకు మూడో రోజే ఇన్నింగ్స్ విజయం దక్కేది. వాగ్నర్ 2, సౌథీ, బౌల్ట్, జెమిసన్, మిచెల్ ఒక్కో వికెట్ తీశారు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌కు విండీస్ 185 రన్స్ వెనుకంజలో ఉంది. విలియమ్సన్ సేన మొదటి ఇన్నింగ్స్‌లో 519/7 (డిక్లేర్డ్) స్కోరు చేసింది.