టాప్‌-10లోనే షఫాలీ, స్మృతి

ABN , First Publish Date - 2020-10-03T09:08:20+05:30 IST

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రీడాకారిణులు షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ టాప్‌-10లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చి

టాప్‌-10లోనే షఫాలీ, స్మృతి

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రీడాకారిణులు షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ టాప్‌-10లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి టీమిండియా క్రికెటర్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు. అయినా, తాజా బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో షఫాలి 744 రేటింగ్‌ పాయింట్లతో మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. స్మృతి, రోడ్రిగ్స్‌ 7, 9వ స్థానాల్లోనూ మార్పులేదు.  బౌలింగ్‌ విభాగంలో దీప్తి ఆరో స్థానంలో ఉంది. రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌ ఒక్కోస్థానం మెరుగుపర్చుకొని 7, 8వ ర్యాంక్‌ల్లో నిలిచారు. ఇక టీమ్‌ విభాగంలో భారత్‌ 270 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (291), ఇంగ్లండ్‌ (280) టాప్‌-2 ర్యాంక్‌ల్లో మార్పులేదు.

Updated Date - 2020-10-03T09:08:20+05:30 IST