పొట్టి కప్పు కష్టమే!

ABN , First Publish Date - 2020-05-29T09:17:10+05:30 IST

షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగకపోవచ్చని ఇంగ్లండ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అభిప్రాయపడ్డాడు....

పొట్టి కప్పు కష్టమే!

లండన్‌: షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగకపోవచ్చని ఇంగ్లండ్‌ వన్డే జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఈ టోర్నీ అనుకున్న ప్రకారం జరిగితే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే కరోనా వైర్‌సను అరికట్టేందుకు ఆసీస్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. చాలా ముందుగానే వారు తమ సరిహద్దులను మూసేశారు. అందుకే మిగతా దేశాలతో పోలిస్తే అక్కడ పాజిటివ్‌ కేసులు తక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి స్థితిలో ఒక్కసారిగా విదేశాల నుంచి 16 జట్లు వచ్చి వివిధ వేదికల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతిస్తే తీవ్రత పెరగవచ్చు’ అని మోర్గాన్‌ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-05-29T09:17:10+05:30 IST