లక్ష్మణ్‌ ఇన్నింగ్సే అత్యుత్తమం

ABN , First Publish Date - 2020-03-30T10:02:36+05:30 IST

వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈడెన్‌ గార్డెన్‌లో ఆస్ట్రేలియాపై 281 పరుగుల ఇన్నింగ్స్‌ భారత క్రికెట్‌ అభిమాని ఎవరూ మర్చిపోలేనిది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్‌ ...

లక్ష్మణ్‌ ఇన్నింగ్సే అత్యుత్తమం

ఇయాన్‌ చాపెల్‌

మెల్‌బోర్న్‌: వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈడెన్‌ గార్డెన్‌లో ఆస్ట్రేలియాపై 281 పరుగుల ఇన్నింగ్స్‌ భారత క్రికెట్‌ అభిమాని ఎవరూ మర్చిపోలేనిది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ సాగిన అతడి విన్యాసాన్ని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్లలో ఒకటిగా పేర్కొన్నాడు. లెగ్‌ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ బౌలింగ్‌ను లక్ష్మణ్‌ ఆడిన తీరు అత్యద్భుతమని చాపెల్‌ కొనియాడాడు. ‘టాప్‌ క్లాస్‌ స్పిన్‌ బౌలింగ్‌లో సూపర్‌ ఫుట్‌వర్క్‌తో ఆడిన వారిలో లక్ష్మణ్‌, వాల్టర్స్‌ (ఆసీస్‌) నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ బ్యాట్స్‌మెన్‌. ముఖ్యంగా లెగ్‌ స్పిన్నర్‌ వార్న్‌పై వీవీఎస్‌ ఆధిపత్యం ప్రదర్శించిన తీరు అసామాన్యం. ఆ మ్యాచ్‌లో తనది చెత్త బౌలింగ్‌ కాదని, అదంతా లక్ష్మణ్‌ ఫుట్‌వర్క్‌ గొప్పతనమని ఓ సందర్భంలో వార్న్‌ నాకు చెప్పాడు’ అని చాపెల్‌ తెలిపాడు. 


Updated Date - 2020-03-30T10:02:36+05:30 IST