కపిల్ దేవ్‌ను భయపెట్టిన కెప్టెన్.. ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2020-07-16T03:50:02+05:30 IST

భారత్‌కు క్రికెట్లో తొలి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా ‘హరియాణా హరికేన్’ కపిల్ దేవ్‌కు పేరుంది.

కపిల్ దేవ్‌ను భయపెట్టిన కెప్టెన్.. ఎవరో తెలుసా?

ముంబై: భారత్‌కు క్రికెట్లో తొలి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా ‘హరియాణా హరికేన్’ కపిల్ దేవ్‌కు పేరుంది. ఈ హరికేన్‌ను కూడా ఓ కెప్టెన్ వణికించాడట. ఈ విషయాన్ని స్వయంగా కపిల్ దేవే వెల్లడించాడు. భారత మాజీ కెప్టెన్లలో శ్రీనివాస వెంట్రాఘవన్ అంటే తనకు చచ్చేంత భయమని కపిల్ చెప్పాడు. ‘వెంకట్రాఘవన్ అంటే నాకు చచ్చేంత భయం. దీనికి చాలా కారణాలున్నాయి. వీటిలో ఒకటి.. ఆయన ఎప్పుడూ ఇంగ్లీషే మాట్లాడేవాడు. రెండోది ఆయన కోపం. జట్టులోని అందరికీ ఆయన కోపమంటే వణుకకే. అంపైర్‌గా ఉన్నప్పుడు కూడా నాటౌట్ అని వెంకట్రాఘవన్ చెప్తే.. బౌలర్‌పై అరిచినట్లే ఉండేది’ అని కపిల్ వివరించాడు.

Updated Date - 2020-07-16T03:50:02+05:30 IST