సెమీస్ ఓటమికంటే.. సచిన్ నాటౌటని తెలిసి ఎక్కవ బాధపడ్డా : సయిద్ అజ్మల్

ABN , First Publish Date - 2020-04-28T18:08:01+05:30 IST

2011 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ తమ జట్టు ఓటమిపాలైనందుకు కంటే ఎక్కువగా సచిన్ టెండూల్కర్ వికెట్‌

సెమీస్ ఓటమికంటే.. సచిన్ నాటౌటని తెలిసి ఎక్కవ బాధపడ్డా : సయిద్ అజ్మల్

కరాచీ: 2011 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ తమ జట్టు ఓటమిపాలైనందుకు కంటే ఎక్కువగా సచిన్ టెండూల్కర్ వికెట్‌ తీయలేకపోయినందుకు బాధపడ్డానని పాకిస్థాన్ మాజీ స్పిన్ బైలర్ సయిద్ అజ్మల్ అన్నారు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సయిద్ బౌలింగ్‌ ఎల్‌బీడబ్ల్యూ అయ్యారు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ కూడా దాన్ని ఔట్‌గా ప్రకటించారు. అయితే ఆ వికెట్‌ని పరిశీలించిన థర్డ్ అంపైర్ బిల్లీ బౌడెన్.. అది నాటౌట్‌గా నిర్ధారించారు. 


అయితే కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూలో.. సచిన్ టెండూల్కర్‌ను ఔట్‌గా ఇచ్చిన తన నిర్ణయంపై ఇప్పటికీ నిలబడి ఉంటానని ఇయాన్ గౌల్డ్ అన్నారు. తాజా అజ్మల్ కూడా తన వికెట్ గురించి స్పందించారు. ‘‘అతను(సచిన్) ఔట్ అయ్యాడని నాకు 100 శాతం నమ్మకం ఉంది. అఫ్రిదీ, కమ్రన్, వహాబ్‌లు నన్ను అడిగితే.. నేను అతను ఔట్ అయ్యాడనే చెప్పాను. కానీ థర్డ్ అంపైర్ సచిన్‌ని నాటౌట్ అని ప్రకటించినప్పుడు నా గుండె పగిలిపోయింది. సచిన్ టెండూల్కర్‌తో నాకు టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. కేవలం ఆయనతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం నేను శక్తివంచన లేకుండా ప్రదర్శన చేశాను. సెమీఫైనల్‌లో ఓటమికంటే సచిన్ టెండూల్కర్ వికెట్ తీయలేదనే విషయమే నన్ను ఎక్కువ నిరాశపరిచింది’’ అని అజ్మల్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-28T18:08:01+05:30 IST