ప్రపంచకప్‌లో ఇచ్చిన మెడల్ పోయింది: జోఫ్రా ఆర్చర్
ABN , First Publish Date - 2020-04-26T22:58:17+05:30 IST
2019 క్రికెట్ ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన తర్వాత తనకు ఇచ్చిన మెడల్‌ను వేరే ఇంటికి మారే క్రమంలో కోల్పోయనని.. ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా

లండన్: 2019 క్రికెట్ ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన తర్వాత తనకు ఇచ్చిన మెడల్‌ను వేరే ఇంటికి మారే క్రమంలో కోల్పోయనని.. ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తెలిపాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన ఆర్చర్ న్యూజిలాండ్‌తో ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో ఆర్చర్ సూపర్ ఓవర్‌లో ఆర్చర్ బాధ్యయుతంగా బౌలింగ్ చేసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే శనివారం తను ఆపార్ట్‌మెంట్ మారిన సమయంలో మెడల్‌ని కోల్పోయానని బీసీసీ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్చర్ తెలిపాడు. ‘‘నా కోసం ఒకరు తయారు చేసిన ఓ ఫొటో ఫ్రేమ్‌లో నేను ఆ మెడల్‌ని ఉంచాను. అయితే అపార్ట్‌మెంట్ మారిన తర్వాత చూస్తే.. అక్కడ ఫొటో మాత్రమే ఉంది.. మెడల్ లేదు. ఇళ్లు మొత్తం వెతికాను. కానీ ఎక్కడా కనిపించలేదు. నాకు తెలిసి అది ఇంట్లోనే ఉంటుంది. కచ్చితంగా దొరుకుంతదని ధీమాతో ఉన్నాను. కానీ, దాని కోసం వెతికి నాకు పిచ్చి ఎక్కింది’’ అని ఆర్చర్ అన్నాడు.