‘మైండ్‌బ్లాక్’ పాటకి డ్యాన్స్ చేయలేను.. ఎందుకంటే..: వార్నర్
ABN , First Publish Date - 2020-05-17T20:55:03+05:30 IST
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడు, విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. ఇటీవల

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడు, విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. ఇటీవల `అల వైకుంఠపురములో..` చిత్రంలోని `బుట్టబొమ్మ` ‘రాములో రాములా’ పాటలకు తన భార్యతో కలిసి వార్నర్ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. దాని తర్వాత `పోకిరి` చిత్రంలోని `ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను` అనే డైలాగ్ చెప్పాడు. తాజాగా బాహుబలి చిత్రం నుంచి ‘అమరేంద్రం బాహుబలి అను నేను’ అనే డైలాగ్‌తో వార్నర్ టిక్-టాక్ చేశాడు.
అయితే మొదటి నుంచి కూడా సూపర్‌స్టార్ మహేశ్ బాబు రీసెంట్ సూపర్ హిట్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లోని ‘మైండ్‌బ్లాక్’ పాటకి టిక్-టాక్ చేయాలని అభిమానులు వార్నర్‌ని కోరుతున్నారు. చాలా మంది ఈ విషయమై అతనికి ట్వీట్ చేశారు. అయితే ఈ పాటకి తాను డ్యాన్స్ చేయలేకపోతున్నానని వార్నర్ తాజాగా తెలిపాడు. అందుకు కారణం కూడా అతను తెలిపాడు. ‘‘ఈ పాటనికి నేను డ్యాన్స్ చేయలేను. ఎందుకంటే అది ఆస్ట్రేలియాలో యాప్‌లో అందుబాటులో లేదు. ఒకసారి అందుబాటులోకి వస్తే.. నేను మైండ్‌బ్లాక్ చేస్తాను’’ అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు.