నవ భారత్‌కు ప్రతిరూపాన్ని : కోహ్లీ

ABN , First Publish Date - 2020-12-17T06:12:54+05:30 IST

సరికొత్త భారత్‌కు తాను ప్రతిరూపాన్న’ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రకటించుకొన్నాడు. ఎటువంటి సవాల్‌నైనా సానుకూల దృక్పథంతో స్వీకరించడానికి తాను సిద్ధమని చెప్పాడు...

నవ భారత్‌కు ప్రతిరూపాన్ని : కోహ్లీ

అడిలైడ్‌: సరికొత్త భారత్‌కు తాను ప్రతిరూపాన్న’ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రకటించుకొన్నాడు. ఎటువంటి సవాల్‌నైనా సానుకూల దృక్పథంతో స్వీకరించడానికి తాను సిద్ధమని చెప్పాడు. ‘ఆస్ట్రేలియన్‌ మైండ్‌ సెట్‌ కలిగిన నాన్‌ ఆస్ట్రేలియన్‌ విరాట్‌’ అని ఆ దేశ మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌ కితాబిచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా ఆటగాళ్ల తరహాలో దూకుడు, పోరాడేతత్వం కోహ్లీలో ఉన్నాయని టీమిండియా మాజీ కోచ్‌గా పని చేసిన గ్రెగ్‌ విశ్లేషించాడు. ఈ విశ్లేషణకు కోహ్లీ జవాబిచ్చాడు. తొలి టెస్ట్‌ ముందు బుధవారం జరిగిన వర్చువల్‌ మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ‘నేను నేనుగా ఉండాలనుకుంటున్నాన’ని కోహ్లీ చెప్పాడు. ‘నవీన భారత్‌కు నేను ప్రాతినిథ్యం వహిస్తున్నా. నా నడక, నడత కూడా ఆ విధంగానే ఉంటుంది.  భారత జట్టు ఆటగాడిగా సగర్వంగా తలెత్తుకొని నిలవాలన్న భావన నుంచి ఇది మొదలైంది. కెరీర్‌ ఆరంభం నుంచే నా తీరు ఇంతేన’ని విరాట్‌ చెప్పాడు. ప్రతి చాలెంజ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమని పేర్కొన్నాడు.


Updated Date - 2020-12-17T06:12:54+05:30 IST