ఆడేందుకు నేను సిద్ధం: సెరెనా
ABN , First Publish Date - 2020-06-18T07:36:10+05:30 IST
కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగకముందే యూఎస్ ఓపెన్‌లో ఆడలేమంటూ జొకోవిచ్, నడాల్‌లాంటి అగ్రశ్రేణి క్రీడాకారులంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మాత్రం ఆ గ్రాండ్‌స్లామ్‌కు
న్యూయార్క్: కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగకముందే యూఎస్ ఓపెన్‌లో ఆడలేమంటూ జొకోవిచ్, నడాల్‌లాంటి అగ్రశ్రేణి క్రీడాకారులంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మాత్రం ఆ గ్రాండ్‌స్లామ్‌కు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో పాల్గొనేందుకు తాను సిద్ధమని తెలిపింది. ఈ మేరకు యూఎస్ టెన్నిస్ సంఘం టోర్నీ ప్రజెంటేషన్ కార్యక్రమం సందర్భంగా విడుదల చేసిన వీడియోలో తన నిర్ణయాన్ని సెరెనా ప్రకటించింది. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఆరుసార్లు విజేతగా నిలిచిన 38 ఏళ్ల సెరెనా.. టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఆ వీడియోలో పేర్కొంది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 వరకు ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నట్టు టోర్నీ నిర్వాహకులు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.