టాస్ గెలిచిన హైదరాబాద్.. వచ్చేసిన రోహిత్

ABN , First Publish Date - 2020-11-04T00:43:52+05:30 IST

ఐపీఎల్‌లో నేడు మరో కీలక పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. ముంబైతో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్

టాస్ గెలిచిన హైదరాబాద్.. వచ్చేసిన రోహిత్

షార్జా: ఐపీఎల్‌లో నేడు మరో కీలక పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. ముంబైతో మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వార్నర్ సేన విజయం సాధిస్తే మెరుగైన రన్‌రేట్ కారణంగా నాలుగో స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న కోల్‌కతా కథ ముగిసిపోతుంది. ఒకవేళ ముంబై కనుక విజయం సాధిస్తే ఐపీఎల్ నుంచి హైదరాబాద్ నిష్క్రమిస్తుంది. 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఈ మ్యాచ్‌లో ఓడినా జరిగే నష్టం ఏమీ ఉండదు కానీ, నాకౌట్‌కు ముందు వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉండడంతో ఏమాత్రం పొరపాట్లు చేయకూడదని భావిస్తోంది.


మరోవైపు, వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో విజయం కోసం గట్టిగా పోరాడే అవకాశం ఉంది. హైదరాబాద్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. అభిషేక్ శర్మ స్థానంలో ప్రియం గార్గ్ వచ్చి చేరాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా జట్టుకు దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. కీలక బౌలర్లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి కల్పించారు. బుమ్రా, బౌల్ట్‌కు విశ్రాంతి ఇచ్చి పాటిన్సన్, ధవళ్ కుల్‌కర్ణిలను తీసుకున్నారు. జయంత్ యాదవ్ స్థానంలో రోహిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. 


Updated Date - 2020-11-04T00:43:52+05:30 IST