టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్
ABN , First Publish Date - 2020-10-09T00:44:45+05:30 IST
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో

దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో పరాజయం పాలైన పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు 5 మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లలోనూ మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలకమైన సమయాల్లో చతికిలపడడంతో తరచూ ఓటమి పాలవుతున్నాయి.
పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. జోర్డాన్, బ్రార్, సర్ఫరాజ్‌లను పక్కనపెట్టి ప్రభ్‌సిమ్రన్, అర్ష్‌దీప్, ముజీబ్‌లకు చోటిచ్చింది. హైదరాబాద్ మాత్రం ఒకే ఒక్క మార్పు చేసింది. కౌల్ స్థానంలో ఖలీల్‌కు తుది జట్టులో స్థానం కల్పించింది.