జైపూర్‌లో భారీ క్రికెట్‌ స్టేడియం

ABN , First Publish Date - 2020-07-05T08:49:15+05:30 IST

ప్రపంచంలో మూడోది, దేశంలోనే రెండో అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. జైపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని చోన్ప్‌

జైపూర్‌లో భారీ క్రికెట్‌ స్టేడియం

జైపూర్‌: ప్రపంచంలో మూడోది, దేశంలోనే రెండో అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. జైపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని చోన్ప్‌ గ్రామంలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో రూ. 350 కోట్ల అంచనా వ్యయంతో స్టేడియంను నిర్మించేందుకు రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఆర్‌సీఏ) తీర్మానించింది. 75 వేల సీటింగ్‌ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ స్టేడియంలో రెండు ప్రాక్టీస్‌ గ్రౌండ్లు, 30 ప్రాక్టీస్‌ నెట్స్‌, 4 వేల వాహనాలకు పార్కింగ్‌తో పాటు ఒక క్లబ్‌ హౌస్‌, రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తామని ఆర్‌సీఏ వర్గాలు తెలిపాయి. రెండేళ్లలో స్టేడియాన్ని సిద్ధం చేస్తామన్నారు. అహ్మదాబాద్‌లోని మొతేరా (లక్షా పది వేల సీటింగ్‌), ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ (లక్షా రెండు వేల సీటింగ్‌) తర్వాత జైపూర్‌లో కట్టబోయేది మూడో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం కానుంది. 

Updated Date - 2020-07-05T08:49:15+05:30 IST