మహిళల టీ20 ప్రపంచకప్‌నకు అర్హత ఎలాగంటే..!
ABN , First Publish Date - 2020-12-13T10:14:57+05:30 IST
2023లో దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ అర్హత ప్రక్రియను ఐసీసీ శనివారం ప్రకటించింది. 10 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ.. వాస్తవానికి 2022 నవంబరు-డిసెంబరులో జరగాలి. కానీ, దీన్ని 2023 ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు రీషెడ్యూల్ చేశారు.

దుబాయ్: 2023లో దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ అర్హత ప్రక్రియను ఐసీసీ శనివారం ప్రకటించింది. 10 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ.. వాస్తవానికి 2022 నవంబరు-డిసెంబరులో జరగాలి. కానీ, దీన్ని 2023 ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు రీషెడ్యూల్ చేశారు. ఇక.. ఆతిథ్య సౌతాఫ్రికాతోపాటు 2021, నవంబరు చివరికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-7లో ఉన్న జట్లు నేరుగా ఈ పొట్టి వరల్డ్‌కప్‌నకు అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం 37 జట్లు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులోని ఫైనలిస్టులకు ప్రపంచకప్ బెర్త్ దక్కుతుంది. 2021, ఆగస్టు నుంచి రీజనల్ స్థాయిలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. భూటాన్, బోట్సువానా, కామెరూన్, ఫ్రాన్స్, మలావీ, మయన్మార్, ఫిలిప్సీన్స్, టర్కీ తొలిసారి ఐసీసీ క్వాలిఫికేషన్ ఈవెంట్లో పాల్గొననున్నాయి.