హిట్‌మ్యాన్ బ్యాక్!
ABN , First Publish Date - 2020-12-30T06:56:54+05:30 IST
రోహిత్ శర్మ మూడో టెస్టులో ఆడడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆ మ్యాచ్ జరిగే సిడ్నీలోనే ప్రస్తుతం రోహిత్ క్వారంటైన్‌లో ఉన్నాడు.

రోహిత్ శర్మ మూడో టెస్టులో ఆడడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆ మ్యాచ్ జరిగే సిడ్నీలోనే ప్రస్తుతం రోహిత్ క్వారంటైన్‌లో ఉన్నాడు. ఈ గడువు ముగియడంతో బుధవారం జట్టుతో కలవనున్నాడు. తొడ కండరాల నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్ ఇప్పుడు మ్యాచ్ ఫిట్‌నె్‌సతో ఉన్నాడు.
శుక్రవారం బీసీసీఐ మెడికల్ టీమ్ మరోసారి అతడిని పరీక్షించనుంది. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. అతడి ఫిట్‌నె్‌సపై సానుకూల ఫలితం వస్తే.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై వేటు పడవచ్చు. మయాంక్ రెండు టెస్టుల్లో కలిపి 31 రన్సే చేశాడు.