షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు..జట్టులో చోటు కోల్పోయాడు

ABN , First Publish Date - 2020-05-07T09:53:22+05:30 IST

కరోనా నేపథ్యంలో జర్మనీకి చెందిన హెర్థా బెర్లిన్‌ అనే సాకర్‌ క్లబ్‌ తమ ఆటగాళ్లందరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మెడికల్‌ క్యాంప్‌ను ...

షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు..జట్టులో చోటు కోల్పోయాడు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో జర్మనీకి చెందిన హెర్థా బెర్లిన్‌ అనే సాకర్‌ క్లబ్‌ తమ ఆటగాళ్లందరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్లబ్‌కు చెందిన ఫార్వర్డ్‌ ఆటగాడు సొలోమన్‌ కాలౌ (34) భౌతిక దూరం నిబంధనలను పాటించకపోవడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. శిబిరంలోని సహచరులందరికీ ఉద్దేశపూర్వకంగా షేక్‌హ్యాండ్‌ ఇవ్వడంతో పాటు ఈ తతంగాన్నంతా సోషల్‌ మీడియాలో లైవ్‌ టెలికాస్ట్‌ చేశాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన క్లబ్‌ యాజమాన్యం క్రమశిక్షణ చర్యల కింద అతడిని ఏకంగా జట్టు నుంచే తొలగించింది. 

Updated Date - 2020-05-07T09:53:22+05:30 IST