అబాట్‌ స్థానంలో హెన్రిక్స్‌

ABN , First Publish Date - 2020-12-15T06:17:20+05:30 IST

ఆస్ట్రేలియా జట్టు గాయాల జాబితాలో మరో ఆట గాడు చేరాడు. కాలి పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్న పేసర్‌ సీన్‌ అబాట్‌ భారత్‌తో జరిగే తొలి టెస్టుకు దూరమయ్యాడు...

అబాట్‌ స్థానంలో హెన్రిక్స్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టు గాయాల జాబితాలో మరో ఆట గాడు చేరాడు. కాలి పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్న పేసర్‌ సీన్‌ అబాట్‌ భారత్‌తో జరిగే తొలి టెస్టుకు దూరమ య్యాడు. అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌కు జట్టులో చోటు కల్పించారు. మరోవైపు ఇప్పటికే వార్నర్‌, వుకోస్కి, గ్రీన్‌, జాక్సన్‌ బర్డ్‌ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.

Read more