భారత యువ ఆటగాడిపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల వర్షం
ABN , First Publish Date - 2020-12-27T12:30:42+05:30 IST
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచు శనివారం ప్రారంభమైంది.

మెల్‌బోర్న్: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచు శనివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అతని ఆట చూసిన ఆసీస్ దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్.. శుభ్‌మన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతను అంతర్జాతీయ స్థాయికి చెందిన ఆటగాడని కొనియాడాడు. ‘‘శుభ్‌మన్ టెక్నిక్ చాలా బాగుందని అనిపించింది. తొలిరోజు ఆటలో అతను చాలా సాలిడ్‌గా కనిపించాడు’’ అని మెచ్చుకున్నాడు.