వీళ్లు బౌలింగ్ చేయడం మీరు ఎప్పుడైనా చూశారా..?

ABN , First Publish Date - 2020-12-17T21:34:27+05:30 IST

క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌లు ఉంటారు. బౌలర్లు ఉంటారు. ఆల్‌రౌండర్లు కూడా ఉంటారు. అయితే బౌలర్లు అప్పుడప్పుడూ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం చూస్తుంటాం మనం. కానీ ప్రోఫెషనల్ బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయడం మాత్రం...

వీళ్లు బౌలింగ్ చేయడం మీరు ఎప్పుడైనా చూశారా..?

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌లు ఉంటారు. బౌలర్లు ఉంటారు. ఆల్‌రౌండర్లు కూడా ఉంటారు. అయితే బౌలర్లు అప్పుడప్పుడూ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం చూస్తుంటాం మనం. కానీ ప్రోఫెషనల్ బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయడం మాత్రం అరుదుగా చూస్తుంటాం. సెహ్వాగ్, సచిన్, సురేశ్ రైనా వంటి వారు కొన్ని సార్లు పార్ట్‌టైం బౌలర్లుగా అలరించినా.. కొందరు బ్యాట్స్‌మెన్ మాత్రం ఎప్పుడూ బౌలింగ్ చేయడం మనం చూసి ఉండం. ఏబీ డివిలియర్స్‌, మహేళ జయవర్దనే, స్టీఫెన్‌ ప్లెమింగ్‌, విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని, సయీద్‌ అన్వర్, మహ్మద్‌ యూసఫ్‌.. వీరంతా అదే కోవలోకి వస్తారు. మరి వీరు బౌలింగ్ చేయడం మీరెప్పుడైనా చూశారా..? లేకపోతే ఇప్పుడు చూడండి.


వీరిలో కొందరు ప్రొఫెషనల్‌ బ్యాట్స్‌మెన్లుగానే కెరీర్ ముగిస్తే.. మరికొందరు ఇప్పుడు కూడా అదరగొడుతున్నారు. అయితే కెరీర్‌ మొత్తం బ్యాటింగ్‌కే పరిమితమైన ఈ ఆటగాళ్లు అత్యంత అరుదుగా ఒకటి, రెండు మ్యాచుల్లో మాత్రం బౌలింగ్ చేశారు. అంతే కాదు తమ పేరిట కొన్ని వికెట్లను కూడా నమోదు చేసుకున్నారు. కొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి మ్యాచ్‌లు గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఇలాంటి కొన్ని అరుదైన క్రికెటర్ల బౌలింగ్ ఫీట్‌లను ఐసీసీ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


ఈ మొమరబుల్‌ వీడియోలో జయవర్దనే, ఏబీ డివిలియర్స్‌, ఎంఎస్‌ ధోని, స్టీఫెన్‌ ప్లెమింగ్‌ లాంటి దిగ్గజ బ్యాట్స్‌మన్‌లు బౌలింగ్‌ చేయడమే గాక వికెట్లు తీయడం మనం చూడవచ్చు. భారత మాజీ కెప్టెన్ ధోనీ, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ లాంటి దిగ్గజాలెందరో తమ బంతితోనూ ప్రత్యర్థులను బెంబేలెత్తించిన అరుదైన క్షణాలివి. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఐసీసీ.. ‘విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మహేలా జయవర్దనే తీసిన అంతర్జాతీయ వికెట్లు తీసిన వీడియో ఇది. మిస్ కాకండి’ అంటూ రాసుకొచ్చింది. బ్యాట్‌తోనే కాదు బంతితోనూ రాణించగల అద్భుతమైన ఆటగాళ్లు కాబట్టే వాళ్లు లెజెండ్‌లు అయ్యారు.Updated Date - 2020-12-17T21:34:27+05:30 IST