నిలకడ కోల్పోయా.. టీమిండియా పునరాగమనంపై కరుణ్ నాయర్!

ABN , First Publish Date - 2020-08-12T04:04:45+05:30 IST

టీమిండియాలో తన పునరాగమనం అప్పుడే కష్టమని భారత బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ చెప్పాడు.

నిలకడ కోల్పోయా.. టీమిండియా పునరాగమనంపై కరుణ్ నాయర్!

న్యూఢిల్లీ: టీమిండియాలో తన పునరాగమనం అప్పుడే కష్టమని భారత బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ చెప్పాడు. దేశవాళీల్లో తను నిలకడగా రాణించడం లేదని, ఇలాంటి సమయంలో టీమిండియాలో పునరాగమనం కష్టమని నాయర్ తెలిపాడు. అయితే టీమిండియా తరఫున సత్తా నిరూపించుకోవడానికి తనకు ఎక్కువ అవకాశాలు రాలేదని నాయర్ అన్నాడు. 28ఏళ్ల నాయర్ చివరగా 2017లో భారత్ తరఫున క్రికెట్ ఆడాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడిన నాయర్.. భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్.

Updated Date - 2020-08-12T04:04:45+05:30 IST