హార్దిక్ పాండ్యా కొడుకు పేరు ఏంటో తెలుసా?

ABN , First Publish Date - 2020-08-18T22:20:33+05:30 IST

తండ్రిగా ప్రమోషన్ పొందిన స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన తనయుడి పేరుని ప్రకటించాడు. ‘అగస్త్య’ అని పేరు పెట్టాడు.

హార్దిక్ పాండ్యా కొడుకు పేరు ఏంటో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: తండ్రిగా ప్రమోషన్ పొందిన స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన తనయుడి పేరుని ప్రకటించాడు. ‘అగస్త్య’ అని పేరు పెట్టాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. హార్దిక్ కాబోయే భార్య నటాసా స్టాంకోవిక్ జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడంతో నెట్టింట ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. సెర్బియన్‌ నటి నటాషాతో హార్థిక్‌ పాండ్యా నిశ్చితార్థం ఈ ఏడాది ప్రారంభంలో జరిగింది. మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు పాండ్యా ప్రకటించాడు. అయితే, హార్దిక్ కొడుకు కోసం మెర్సిడెస్ కంపెనీ డీలర్ షిప్ వారు ఓ బొమ్మ కారును బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని ఇన్ స్టాలో చెబుతూ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా తన తనయుడి పేరు అగస్త్య అని చెప్పాడు.Updated Date - 2020-08-18T22:20:33+05:30 IST