హంపి, హారిక ఓటమి

ABN , First Publish Date - 2020-07-10T07:33:23+05:30 IST

ఫిడే మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప లెగ్‌-3లో భారత్‌ పోరాటం ముగిసింది. ఆన్‌లైన్‌లో గురువారం జరిగిన క్వార్టర్స్‌లో కోనేరు హంపి 2-9 స్కోరుతో అలెగ్జాండ్రా కోస్టెనిక్‌ (రష్యా) చేతిలో ఓడింది.

హంపి, హారిక ఓటమి

చెన్నై: ఫిడే మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప లెగ్‌-3లో భారత్‌ పోరాటం ముగిసింది. ఆన్‌లైన్‌లో గురువారం జరిగిన క్వార్టర్స్‌లో కోనేరు హంపి 2-9 స్కోరుతో అలెగ్జాండ్రా కోస్టెనిక్‌ (రష్యా) చేతిలో ఓడింది. మరో గేమ్‌లో ద్రోణవల్లి హారిక 2-9 స్కోరుతో హో యిఫాన్‌ (చైనా) చేతిలో పరాజయం ఎదుర్కొంది. ఆర్‌.వైశాలి తొలి రౌండ్‌లోనే హంపి చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 15న జరగనున్న ఆఖరి, నాలుగో లెగ్‌లో హంపి, హారిక, వైశాలి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Updated Date - 2020-07-10T07:33:23+05:30 IST