హామిల్టన్‌..‘ఫాస్టెస్ట్‌’ ల్యాప్‌

ABN , First Publish Date - 2020-09-06T09:07:18+05:30 IST

ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌.. ఫార్ములావన్‌ చరిత్రలోనే వేగవంతమైన ల్యాప్‌తో రికార్డు సృష్టించాడు...

హామిల్టన్‌..‘ఫాస్టెస్ట్‌’ ల్యాప్‌

రోమ్‌: ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌.. ఫార్ములావన్‌ చరిత్రలోనే వేగవంతమైన ల్యాప్‌తో రికార్డు సృష్టించాడు. శనివారం జరిగిన ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రీ క్వాలిఫయింగ్‌ రేసులో మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ రికార్డు ప్రదర్శనతో పోల్‌ పొజిషన్‌ సాధించాడు. మోంజా ట్రాక్‌పై ఓ ల్యాప్‌ను  ఒక నిమిషం 18.887 సెకన్ల రికార్డు సమయంలో పూర్తి చేశాడు. హామిల్టన్‌కిది కెరీర్‌లో 94వ పోల్‌ పొజిషన్‌. 

Updated Date - 2020-09-06T09:07:18+05:30 IST