ఫైనల్లో హలెప్‌, జొకోవిచ్‌

ABN , First Publish Date - 2020-09-21T08:39:49+05:30 IST

మహిళల టెన్నిస్‌ మాజీ నెంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ ఇటాలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఫైనల్లో హలెప్‌, జొకోవిచ్‌

రోమ్‌: మహిళల టెన్నిస్‌ మాజీ నెంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ ఇటాలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో టాప్‌సీడ్‌ హలె ప్‌ 6-3, 4-6, 6-4తో ముగురుజాపై గెలిచి ఇక్కడ మూడోసారి తుదిపోరులో నిలిచింది. మరో సెమీస్‌లో కరోలినా ప్లిస్కోవా 6-2, 6-4తో వొండ్రుసోవాను ఓడించి హలెప్‌తో ఫైనల్‌ ఫైట్‌కు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో టాప్‌సీడ్‌ జొకోవిచ్‌ 7-5, 6-3తో నార్వేకు చెందిన కాస్పర్‌ రుడ్‌ను చిత్తుచేసి పదోసారి ఫైనల్‌ చేరాడు.

Updated Date - 2020-09-21T08:39:49+05:30 IST