ఇదీ కటింగే!

ABN , First Publish Date - 2020-04-18T08:22:33+05:30 IST

లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన తాజా, మాజీ క్రికెటర్లు ఖాళీ సమయాల్లో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొందరైతే భార్యలతో హెయిర్‌ కట్‌

ఇదీ కటింగే!

లండన్‌: లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన తాజా, మాజీ క్రికెటర్లు ఖాళీ సమయాల్లో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కొందరైతే భార్యలతో హెయిర్‌ కట్‌ చేయించుకొని ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. విరాట్‌ కోహ్లీలాగే తన తలని భార్యకి అప్పగించేసి తాపీగా కూర్చున్న ఇంగ్లండ్‌ మాజీ టెస్ట్‌ క్రికెటర్‌ రాబర్ట్‌ కీ పరిస్థితి ఇలా తయారైంది. అదేంటంటే ‘నువ్వు చెప్పినట్టే చేశాను కదా’ అన్నది రాబర్ట్‌ భార్య ఫ్లయిర్‌ సమాధానమట. ‘చాలా బాగా చేశావు. ఇంకెప్పుడూ నీతో హెయిర్‌ కట్‌ చేయించుకోను’ అని రాబర్ట్‌ సరదాగా ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-04-18T08:22:33+05:30 IST