ఎదురీదుతున్న గుజరాత్‌, కర్ణాటక

ABN , First Publish Date - 2020-03-02T10:06:05+05:30 IST

బెంగాల్‌ యువ పేసర్‌ ఇషాన్‌ పోరెల్‌ (5/39) చెలరేగడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 36.2 ఓవర్లలో 122 పరుగులకే కుప్ప కూలింది. అనంతరం రెండో ...

ఎదురీదుతున్న గుజరాత్‌, కర్ణాటక

కోల్‌కతా/రాజ్‌కోట్‌: బెంగాల్‌ యువ పేసర్‌ ఇషాన్‌ పోరెల్‌ (5/39) చెలరేగడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 36.2 ఓవర్లలో 122 పరుగులకే కుప్ప కూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్‌ ఆట ముగిసేసరికి 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 190 పరుగుల ఆధిక్యంతో కలిపి బెంగాల్‌ ప్రస్తుతం 262 రన్స్‌ లీడ్‌లో ఉంది. రాజ్‌కోట్‌ వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మరో సెమీస్‌లో షెల్డన్‌ జాక్సన్‌ (103) శతకంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజైన ఆదివారం 217/5తో బ్యాటింగ్‌ కొనసాగించిన సౌరాష్ట్ర మరో 87 పరుగులు జత చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన గుజరాత్‌ 119/6 స్కోరు చేసింది.

Updated Date - 2020-03-02T10:06:05+05:30 IST