ఆంక్షలు ఉన్నా..ఆసీస్‌ టూర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

ABN , First Publish Date - 2020-04-26T10:08:20+05:30 IST

ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు ఊరటనిచ్చే వార్త. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు ఆంక్షల సడలింపు ఇచ్చే ...

ఆంక్షలు ఉన్నా..ఆసీస్‌ టూర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

మెల్‌బోర్న్‌: ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు ఊరటనిచ్చే వార్త. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు ఆంక్షల సడలింపు ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఆ దేశ ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియాలో సెప్టెంబరు వరకు విదేశీయులకు అనుమతి లేదు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే లాక్‌డౌన్‌ను  పొడిగించే అవకాశం ఉండడంతో ఈ ఏడాది చివర్లో జరగాల్సిన నాలుగు టెస్ట్‌ల సిరీ్‌సపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ భారత జట్టు పర్యటన రద్దయితే సీఏకు సుమారు రూ.1462 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశముంది. దీంతో బోర్డును గట్టెక్కించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం..కోహ్లీ సేన పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. క్రీడా కార్యకలాపాల పునరుద్ధరణకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని ప్రధాని స్కాట్‌ మారిసన్‌ చెప్పడంతో సీఏలో కొంత జోష్‌ కనిపిస్తోంది.

Updated Date - 2020-04-26T10:08:20+05:30 IST