ఫిజికల్‌ లిటరసీ పెరగాలి

ABN , First Publish Date - 2020-05-09T10:14:39+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రజలంతా ఫిజికల్‌ లిటరసీపై దృష్టి సారించాలని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ ...

ఫిజికల్‌ లిటరసీ పెరగాలి

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రజలంతా ఫిజికల్‌ లిటరసీపై దృష్టి సారించాలని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌ సూచించాడు. వ్యాయామం ద్వారా శరీర సౌష్ఠవాన్ని తీర్చిదిద్దుకుంటే కఠిన సవాళ్లకు ఎదురొడ్డి నిలవొచ్చని తెలిపాడు. ఈఎల్‌ఎంఎస్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ వెబినార్‌లో గోపీచంద్‌ మాట్లాడాడు. ‘మనందరి జీవితాల్లో వ్యాయామ అక్షరాస్యత అనేది విడదీయలేని భాగంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రస్తుత కొవిడ్‌-19 రోజుల్లో మంచి ఆరోగ్యం కావాలనుకుంటే ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం తప్పనిసరి. అలాగే కేంద్రం కూడా ఫిజికల్‌ లిటరసీ విస్తరించేందుకు సహకరించాల్సిన అవసరం ఉంది’ అని గోపీచంద్‌ తేల్చాడు. 

Updated Date - 2020-05-09T10:14:39+05:30 IST