భారతీయ సాంప్రదాయంలో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం

ABN , First Publish Date - 2020-03-15T22:58:59+05:30 IST

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారత సంతతికి చెందిన విన్సీ రామన్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న

భారతీయ సాంప్రదాయంలో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారత సంతతికి చెందిన విన్సీ రామన్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు త్వరలో నిశ్చితార్థం చేసుకుంటామని ప్రకటించారు. కాగా, శనివారం మెల్‌బోర్న్‌లోని తూరక్ అనే ప్రాంతంలో భారత సాంప్రదాయంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. 


ఇందుకు సంబంధించిన ఫొటోలను విన్సీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ‘‘గత రాత్రి మేము భారత సాంప్రదాయంలో నిశ్చితార్థం చేసుకున్నాము. మన వివాహ వేడుక ఎలా ఉంటుందో మ్యాక్స్‌వెల్‌కి చిన్న టీజర్ చూపించాను’’ అని విన్సీ ఆ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు జంటకు అభినందనలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-15T22:58:59+05:30 IST