అనుకోకుండా క్రికెటర్‌నయ్యా: గంగూలీ

ABN , First Publish Date - 2020-05-31T03:25:46+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిందని, ఒకసారి టీకా వచ్చిన తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి

అనుకోకుండా క్రికెటర్‌నయ్యా: గంగూలీ

కోల్‌కతా: కరోనా వైరస్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిందని, ఒకసారి టీకా వచ్చిన తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆరేడు నెలల్లో టీకా కనుక అందుబాటులోకి వస్తే పరిస్థితులు మళ్లీ కొలిక్కి వస్తాయన్నాడు. క్రికెట్ చాలా శక్తిమంతమైనదని, బీసీసీఐ, ఐసీసీ కలిసి క్రికెట్‌ను సాధారణ స్థితికి తీసుకొస్తాయని పేర్కొన్నాడు. ఒకప్పుడు తనకు ఫుల్‌బాలే జీవితంగా ఉండేదని, ఆ తర్వాత అనుకోకుండా క్రికెటర్‌గా మారానని దాదా చెప్పుకొచ్చాడు. వేసవిలో తాను ఇంట్లోనే ఉండడంతో తండ్రి తనను క్రికెట్ అకాడమీకి వెళ్లమన్నారని, అలా క్రికెటర్‌గా మారానన్నాడు. ఒడిశాతో మ్యాచ్ సందర్భంగా జట్టులో అందరూ అనారోగ్యం బారినపడడంతో ఆ మ్యాచ్‌లో ఆడే అవకాశం తనకు వచ్చిందని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. 

Updated Date - 2020-05-31T03:25:46+05:30 IST