సౌరవ్‌, షా మరికొంత కాలం

ABN , First Publish Date - 2020-12-10T09:07:50+05:30 IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా మరికొంత కాలం తమ పదవుల్లో కొనసాగనున్నారు. లోధా సంస్కరణల్లో సవరణలు కోరుతూ బీసీసీఐ చేసిన అభ్యర్థనలను...

సౌరవ్‌, షా మరికొంత కాలం

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా మరికొంత కాలం తమ పదవుల్లో కొనసాగనున్నారు. లోధా సంస్కరణల్లో సవరణలు కోరుతూ బీసీసీఐ చేసిన అభ్యర్థనలను బుధవారం విచారించిన సుప్రీంకోర్టు.. తీర్పును జనవరి మూడో వారానికి వాయిదా వేసింది. లోధా సంస్కరణల ప్రకారం గంగూలీ, జై షా పదవీకాలం ఇప్పటికే ముగిసింది. కానీ, సుప్రీం కోర్టు తీర్పు వాయిదా దరిమిలా వారు మరికొద్ది కాలం పదవుల్లో కొనసాగనున్నారు. 

Updated Date - 2020-12-10T09:07:50+05:30 IST