షారూఖ్ ఖాన్ నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు: గంగూలీ

ABN , First Publish Date - 2020-07-10T23:25:44+05:30 IST

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఫ్రాంచైజీ యజమాని షారూఖ్ ఖాన్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేని టీ

షారూఖ్ ఖాన్ నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు: గంగూలీ

ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఫ్రాంచైజీ యజమాని షారూఖ్ ఖాన్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేని టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ చీఫ్ గంగూలీ పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌరవ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల గౌతం గంభీర్ ఇంటర్వ్యూ ఒకటి చూశానని, అందులో అతడు మాట్లాడుతూ.. కేకేఆర్‌కు కెప్టెన్ అయ్యాక షారూఖ్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని పేర్కొన్నాడని, కానీ తన విషయంలో మాత్రం అది జరగలేదని గుర్తు చేసుకున్నాడు. తనకు స్వేచ్ఛ కావాలని షారూఖ్‌ను తొలి సీజన్‌లోనే అడిగినా అది జరగలేదన్నాడు. 


చెన్నై సూపర్ కింగ్స్ ధోనీకి, ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మకు పూర్తి ఇచ్చాయి కాబట్టే మంచి ఫలితాలు వస్తున్నాయని గంగూలీ పేర్కొన్నాడు. ఆటగాళ్లకు యాజమాన్యాలు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నాడు. ధోనీ, రోహిత్‌లకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది కాబట్టే వారు విజయవంతమైన కెప్టెన్లుగా కొనసాగుతున్నారని అన్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ పూర్తయిన వెంటనే జట్టులో సమస్యలు మొదలయ్యాయని పేర్కొన్న గంగూలీ, అవి తన వల్ల మాత్రం కాదని, కెప్టెన్సీ విషయంలో నెలకొన్న గందరగోళం వల్లనేనని వివరించాడు.   

Updated Date - 2020-07-10T23:25:44+05:30 IST