అంకిత ఇంటిదారి..

ABN , First Publish Date - 2020-09-25T09:14:19+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వాలిఫికేషన్‌ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి అంకితా రైనా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన...

అంకిత ఇంటిదారి..

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వాలిఫికేషన్‌ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి అంకితా రైనా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో అంకిత 3-6, 2-6తో వరుస సెట్లలో 22వ సీడ్‌ కురుమి నార (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. గంటా 21 నిమిషాల పోరులో అంకిత ప్రత్యర్థికి ఏమాత్రం పోటీఇవ్వలేక పోయింది. కురిమి 9 బ్రేక్‌ పాయింట్లలో 6 సద్వినియోగం చేసుకుంది. కానీ, అంకిత 23 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 

Updated Date - 2020-09-25T09:14:19+05:30 IST