చార్ట్టర్డ్‌ విమానాలు..హోటళ్ల ఎంపికలు

ABN , First Publish Date - 2020-07-19T09:06:38+05:30 IST

ఈసారి ఐపీఎల్‌ను యూఏఈలో జరపాలని బీసీసీఐ యోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఫ్రాంచైజీలు కూడా టోర్నీకి...

చార్ట్టర్డ్‌ విమానాలు..హోటళ్ల ఎంపికలు

ఐపీఎల్‌ సన్నాహకాల్లో ఫ్రాంచైజీలు

న్యూఢిల్లీ: ఈసారి ఐపీఎల్‌ను యూఏఈలో జరపాలని బీసీసీఐ యోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ఫ్రాంచైజీలు కూడా టోర్నీకి సిద్ధమవుతున్నాయి. ఈమేరకు అబుదాబిలో బసకు హోటల్‌ను కూడా ఎంపిక చేసుకున్నట్టు ఓ ఫ్రాంచైజీ అధికారి వెల్లడించారు. శిక్షణ శిబిరానికి సంబంధించి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు తెలిపారు. ‘మేం స్వదేశంలో ఉన్నాం. మాలో ఎవరికైనా లక్షణాలు లేకుండా కరోనా ఉంటే ఇతరులు చిక్కుల్లో పడతారు. అందుకే కొన్ని వారాలు ముందుగానే యూఏఈ వెళ్లాలి. బయలుదేరే ముందు అంతా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం’ అని ఆ అధికారి వివరించారు. సాధారణ విమానాలు షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభమవుతాయో లేదోనని, అందువల్ల ప్రయాణానికి చార్టర్డ్‌ విమానాలు చక్కగా ఉంటాయని మరో ఫ్రాంచైజీ అధికారి చెప్పారు. వచ్చే నెలాఖరుకు లేదంటే సెప్టెంబరు మొదటి వారానికి యూఏఈ వెళ్లాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. భారత్‌లోనే ఐసోలేషన్‌ గడువు ముగిశాక యూఏఈ చేరుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఐపీఎల్‌ మాజీ చాంపియన్‌ ఫ్రాంచైజీకి చెందిన మరో అధికారి వెల్లడించారు. సాధారణ విమానాల్లో ఫస్ట్‌క్లా్‌సలో అయితే ఎక్కువ భౌతిక దూరానికి అవకాశముంటుందని ఇంకో ఫ్రాంచైజీ అధికారి అభిప్రాయపడ్డారు. అందువల్ల తాము ఆ విమానాలలోనే వెళతామని, అక్కడికి చేరాకే జట్టంతా సమావేశమవుతుందని చెప్పారు. 

Updated Date - 2020-07-19T09:06:38+05:30 IST